నైతిక విజయం నాదే.. ఆ ఇద్దరూ కలిసి నన్ను ఓడించారు : గెల్లు శ్రీనివాస్

by Sridhar Babu |   ( Updated:2021-11-02 09:25:08.0  )
Gellu Ravi
X

దిశ, కరీంనగర్ సిటీ, మానకొండూరు : హుజురాబాద్ ఉపఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యింది. ఊహించిన దానికంటే భిన్నంగా ఫలితాలు వెలువడ్డాయి. అధికార పార్టీ అందించిన సంక్షేమ పథకాలు, సీల్డ్ కవర్లు, దావత్‌లు అన్ని తీసుకుని మరీ హుజురాబాద్ ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌కు కర్రు కాల్చి వాత పెట్టారని అందరూ అనుకుంటున్నారు. ఒకానొక సమయంలో టీఆర్ఎస్ పార్టీ కురిపించిన వరాల జల్లుకు అధికారపార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయం అని టాక్ నడిచింది. గెల్లు, ఈటల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా చర్చ నడిచింది. కానీ, హుజురాబాద్ ఓటర్లు ఈటలకు అండగా నిలిచారు. ఆత్మగౌరవాన్ని గెలిపించారు.

తాజాగా హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితాలపై టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్పందించారు. నైతిక విజయం నాదే అని చెప్పు్కొచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కలిసి తనను ఓడించాయని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ విద్యార్థి నాయకుడిగా తనకు హుజురాబాద్‌లో అవకాశం ఇచ్చారన్నారు. తన విజయం కోసం కష్టపడ్డ మంత్రులతో పాటు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వివరించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తానే నెరవేరుస్తానని గెల్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో తప్పకుండా హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. ఈ ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తున్నానని గెల్లు ప్రకటించారు. ఉపఎన్నికలో గెలుపొందిన ఈటల రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

ఒక్క ఓటమితో టీఆర్ఎస్‌కు నష్టమేమీలేదు.. ఈటల గెలుపుపై హరీష్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed