- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్‌కు టీఆర్ఎస్ కేడర్ ఝలక్..!
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత ఏడేళ్లుగా పార్టీ అధిష్టానం కార్యకర్తలను పట్టించుకోలేదు. దీంతో కిందిస్థాయి నేతల్లో నిరుత్సాహం, అసంతృప్తి నెలకొంది. కార్యకర్తల కష్టసుఖాలను తెలుసుకునేవారే కరువయ్యారు. ఇది గమనించిన అధిష్టానం సంస్థాగతంపై దృష్టిసారించింది. గ్రామస్థాయిలో పార్టీ పరిస్థితిని తెలుసుకొని బలోపేతానికి చర్యలు చేపట్టనుంది. ప్లీనరీ, విజయగర్జన సభకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ మండల స్థాయిలోని పార్టీ నేతలతో ముఖాముఖీగా మాట్లాడుతూ పార్టీ ఎలా ఉంది.. మరింత పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. పార్టీలో అసమ్మతి లేకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కేసీఆర్ నాయకత్వంలో అధికారంలోకి వచ్చింది. 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రెండుసార్లు అధికారం చేపట్టినప్పటికీ పార్టీ లీడర్ షిప్ పై దృష్టిసారించలేదు. ఇతర పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా చేరారు. ఉద్యమం నాటి నుంచి పార్టీ కోసం కృషి చేసిన వారున్నారు. అయితే ఇతర పార్టీల్లో గెలిచి టీఆర్ఎస్‌లో చేరిన వారికి పెద్దపీట వేస్తున్నారని కిందిస్థాయి నుంచి, పై స్థాయి నాయకుల వరకు అసంతృప్తి ఉంది. దీనికి తోడు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదని నిరుత్సాహానికి గురవడంతో పాటు అక్కడక్కడ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వాటికి చెక్ పెట్టేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది పార్టీ అధిష్టానం. అందులో భాగంగానే సంస్థాగతంగా బలోపేందుకు చేసేందుకు చర్యలు చేపట్టింది.
పార్టీకి 60 లక్షల మంది సభ్యత్వం కలిగిన కార్యకర్తలు ఉన్నాయి. అయినప్పటికీ గ్రామస్థాయిలో కార్యకర్తలకు, నాయకులు, ప్రజాప్రతినిధులకు మధ్య కొంత గ్యాప్(అంతరాయం) ఉంది. పార్టీ కింది స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు 90 శాతం ప్రజాప్రతినిధులు ఉన్నప్పటికీ గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంగా లేదు. ప్రజాప్రతినిధులు కార్యకర్తలను, నేతలను పట్టించుకోక పోవడంతో రాష్ట్రంలో అక్కడక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒకవైపు టీఆర్ఎస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్తుండటం, మరోవైపు పార్టీ పతనం, బద్నాం అవుతుండటంతో అసంతృప్తులను బుజ్జగించే పనిలో నిమగ్నమైంది అధిష్టానం.
పార్టీ స్థాపించి 20 ఏళ్లు పూర్తైన సందర్భంగా వరంగల్‌లో వచ్చే నెలా 15న విజయగర్జన నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. దీనిలో భాగంగా ఈ నెల 18 నుంచి ప్రతి రోజూ 20 నియోజకవర్గాలకు చెందిన 400 మంది ప్రజాప్రతినిధులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి సుమారు అర్ధగంట సమయం కేటాయిస్తూ మండల పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. పార్టీ సంస్థాగత పరిస్థితిని క్షుణ్నంగా అడిగి తెలుసుకుంటున్నారు. మండలంలో ఉన్న సమస్యలు, గ్రూపులపై ఆరా తీస్తున్నారు. తీసుకోవల్సిన చర్యలతో పాటు పలు సలహాలు, సూచనలు చేస్తున్నారు.
మండల నాయకులు మాత్రం పార్టీలో చిన్న చూపు చూస్తున్నారని, తమను పట్టించుకోవడం లేదని కేటీఆర్‌కు నివేదిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ఖాతాలో నేరుగా వేయకుండా మండల స్థాయి నేతలతో ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని, తమకు గుర్తింపు ఉండేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కల్యాణ లక్ష్మి, తదితర పథకాలకు సంబంధించిన చెక్కులు అందజేస్తున్నారని, తమకు కొన్ని ఇచ్చేలా చూడాలని విన్నవించుకుంటున్నారు. ఇలా తమకు అవకాశం కల్పిస్తే ప్రజల్లో తమకు ఆధారణ ఉంటుందని, పార్టీ బలోపేతం కూడా అయ్యే అవకాశం ఉంటుందని సంస్థాగతంగా పార్టీని సైతం బలోపేతం చేసుకునే వీలుకలుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే కేటీఆర్ మాత్రం ప్రతి అంశాన్ని పరిశీలన తీసుకొని ఎమ్మెల్యేలు, మండల స్థాయి ప్రజాప్రతినిధులు ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలపై స్పందించాలని సూచిస్తున్నట్లు సమాచారం. పార్టీ గ్రూపులపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని, అందరిని కలుపుకు పోయేలా చర్యలు తీసుకుంటామని, గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమే లక్ష్యమని పేర్కొంటున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ అంటేనే గ్రూపులకు అతీతమనే విధంగా చేస్తామని పార్టీ నేతలకు కేటీఆర్ భరోసా ఇస్తున్నట్లు మండల నాయకులు పేర్కొన్నారు. ఏదీ ఏమైనప్పటికీ ఏడేళ్ల తర్వాత పార్టీలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది టీఆర్ఎస్ అధిష్టానం.
- Tags
- minister Ktr