- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గంలో దిష్టి బొమ్మలకు భారీగా పెరిగిన డిమాండ్.
దిశ, గద్వాల్: గద్వాల్ నియోజకవర్గంలో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు పై చేయి ఉండాలని గత వారం రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. గద్వాల పట్టణంలో అధికార పార్టీ పిలుపు మేరకు అన్ని మండల, గ్రామ స్థాయిలో రైతుల వడ్లు కొనాలని డిమాండ్‌తో కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా ప్రధాన మంత్రి దిష్టి బొమ్మల దగ్ధం చేయాలని పిలుపు ఇవ్వడంతో నియోజకవర్గంలో అన్ని చోట్లా ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ప్రతిపక్ష బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గతంలో మంత్రిగా పని చేసినప్పుడు 1200 మంది పట్టణ పేదలకు దర్గా మిట్ట వద్ద ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ స్థలాన్ని 300 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల కు కేటాయించడంతో వివాదం మొదలైంది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను ఎలా రద్దు చేసి ఆసుపత్రికి, నర్సింగ్ కళాశాల కు కేటాయిస్తారని బీజేపీ పార్టీ నాయకులు గత నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. కేసీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలను గురువారం ఉదయం ర్యాలీ చేపట్టి గాంధీ చౌక్‌లో దగ్ధం చేయడానికి బీజేపీ శ్రేణులు డీకే అరుణ నివాసం నుండి రోడ్ పైకి రావడంతోనే పోలీస్‌లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
టీఆర్ఎస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేసినందుకు నిరసనగా గురువారం సాయంత్రం వైఎస్సార్ చౌక్ లో డీకే అరుణ దిష్టి బొమ్మను టీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం ముగియగానే బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను అదే స్థలంలో వెంటనే దహనం చేయడం జరిగింది. ఇలా పోటాపోటీగా దిష్టి బొమ్మలను బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాల్చుతుండడంతో ప్రజలు ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ఖభఢ్దార్ అంటూ రాతలు రాసుకుని పోస్ట్ లు పెడుతున్నారు.