- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రెచ్చిపోయిన TRS కార్యకర్తలు.. పోలీసులపై దాడి
by Aamani |

X
దిశ, వెబ్‌డెస్క్ : నిర్మల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. కడెం మండలం లింగాపూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. వివరాల ప్రకారం.. రెండు రోజుల క్రితం జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి సోదరుని భార్య రమాదేవి అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు.
అయితే.. పోస్టుమార్టమ్ నిర్వహించకుండా కుటుంబ సభ్యులు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఆమె మృతి పట్ల విషయాలు తెలుసుకుంటుండగా జడ్పీటీసీ అనుచరులు ఏఎస్ఐ, హోంగార్డుపై దాడి చేశారు. ఈ దాడిలో వారు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి సహా మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే సదరు మహిళ.. కుటుంబ కలహాల కారణంగా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.
Next Story