జర్నలిస్టులను బెదిరిస్తున్న టీఆర్‌ఎస్ కార్యకర్త.. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే..?

by Sridhar Babu |
journalist
X

దిశ, మణుగూరు‌: పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తగా ఉంటున్న ఓ నజీరుడు పత్రిక విలేకరులపై సోషల్ మీడియా వేదికగా దురుసుగా ప్రవర్తిస్తున్నాడని జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. పినపాక నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అక్రమాలను విలేకరులు తమ పత్రికలో ప్రచురిస్తే సోషల్ మీడియా సాక్షిగా ఆ విలేకరులపై బెదిరింపులకు పాల్పడుతున్నాడని జర్నలిస్ట్‌లు వాపోతున్నారు. సమాజంలో ఏం జరుగుతుందో పత్రికల ద్వారా విలేకరులు ప్రజలకు తెలియజేస్తుంటే.. వారితో అధికారపార్టీలో ఉన్న నజీరుడు దురుసుగా వ్యవహరించడం నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్న విలేకరులపై దురుసుగా ప్రవర్తించమని నజీరుడుతో స్థానిక ఎమ్మెల్యే చెప్పుతున్నరా అనేది నియోజకవర్గంలో చిక్కు ప్రశ్నగా మారింది. లేకపోతే నజీరుడు సోషల్ మీడియాలో ఆ విధంగా జర్నలిస్ట్‌లపై దురుసుగా రెచ్చిపోతుంటే స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మౌనంగా ఉన్నారనేది అంతుచిక్కని ప్రశ్న.

జర్నలిస్ట్‌లు నిజాలను నిర్బయంగా పత్రికలలో ప్రచురిస్తే వారిపై దురుసుగా ప్రవర్తించడం, బెదిరించడం సమంజసం కాదని జర్నలిస్ట్ సంఘాలు అంటున్నాయి. కొంత మంది వ్యక్తుల ద్వారా ఆ నజీరుడు స్థానిక ఎమ్మెల్యే మనిషే అనే ఆరోపణలే బలంగా వినిపిస్తున్నాయి. గతంలో కూడా కొంతమంది జర్నలిస్ట్‌లను ఇబ్బందులు పెట్టిన దాఖలాలు ఉన్నాయని జర్నలిస్ట్‌లు తెలిపారు. ఆ నజీరుడు అధికారపార్టీలో కార్యకర్తగా ఉంటూ అలా చేయడం స్థానిక ఎమ్మెల్యేకు తీరని మచ్చ అంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా నజీరుడు పద్దతి మార్చుకొని జర్నలిస్ట్‌లు పట్ల మంచితనంగా వ్యవహరించాలని వారు కోరుతున్నారు. లేదంటే ఆయనపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్‌ల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే నజీరుడిని అధికారపార్టీ నుంచి తొలగించాలని లేదంటే.. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకోలు నిర్వహిస్తామని జర్నలిస్ట్‌ల సంఘాలు ఎమ్మెల్యేని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed