వారి నిర్లక్ష్యమే.. రైతులకు శాపం

by Sridhar Babu |   ( Updated:2021-09-11 01:24:29.0  )
వారి నిర్లక్ష్యమే.. రైతులకు శాపం
X

దిశ, చిగురుమామిడి : అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. మత్తడిని నిర్మించకుండా వదిలివేయటంతో, పంట పొలాల్లోకి కుంటలోని వరద నీరు భారీగా చేరి పంట నష్టం జరగడంతో రైతులు లబోదిబోమంటున్నారు. చిగురుమామిడి గ్రామ శివారులోని ఎర్రకుంటలోకి వరదనీరు వచ్చి పెద్ద మొత్తంలో పంట పొలాల్లోకి చేరుతోంది. దీంతో పక్కనే ఉన్న రైతు వంగ సదానందం, దయ్యాల అనిత‌లు మరికొంత మంది రైతుల పంట పొలాల్లోకి నీరు చేరి పంట నష్టం జరుగుతుండడంతో, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే కుంటకు మత్తడితో పాటు తూమును పునర్నిర్మాణం చేయించాలని స్థానిక తహసీల్దార్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వాపోయారు. పక్కనే ఉన్నటువంటి రైతులందరూ కలిసి 60, 70 వేయిల రూపాయలు ఖర్చు చేసి కుంట నీరు పొలాల్లోకి రాకుండా మొరం, మట్టి పోయించినా ఫలితం లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. పట్టా భూములు కలిగి ఉన్న తమ పంటపొలాల్లోకి నీరు వచ్చి నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కుంటకు మరమ్మత్తులు చేయించి తమకు తగిన నష్టపరిహారం ఇవ్వాలని రైతులు వేడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed