జాగ్రత్త… కరోనాకు భాష, ప్రాంత భేదం లేదు…

by Shyam |   ( Updated:2020-03-27 01:01:56.0  )
జాగ్రత్త… కరోనాకు భాష, ప్రాంత భేదం లేదు…
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. చైనా నుంచి దాదాపు 165 దేశాలకు సంక్రమించిన కోవిడ్ 19 వ్యాధిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ఈ పోరాటంలో తమ వంతు సహాయంగా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు సినీ ప్రముఖులు. ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిష లాక్ డౌన్ సమయంలో ఇంటి నుంచి బయటకు రావొద్దని ప్రజలను కోరింది. 21 రోజులు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిందంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవాలని కోరింది. కరోనా వైరస్ అనేది ఎవరిమీద అయినా ప్రభావం చూపగలదని.. మీరు ఏ ప్రాంతానికి చెందిన వారు? మీరు ఎలా ఉన్నారు? మీరు ఏ భాష మాట్లాడుతున్నారు? అనే విషయాలు పట్టించుకోదని హెచ్చరించారు. అందుకే ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని… వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో మానవత్వాన్ని చాటుతూ.. ఇతరులకు సపోర్ట్‌గా నిలవాలని కోరారు. ఇంట్లో ఉండడం అంత సులభం కాదు.. కానీ నేను ఇంట్లో ఉండడానికి స్ఫూర్తి పొందిన విషయం ఏంటంటే? నేను ఇంటికి పరిమితం కావడం వల్ల చాలా మంది ప్రాణాలు కాపాడిన దానిని అవుతాను అని… మీరు కూడా ఇదే విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని… ఇంట్లో ఉండడం ద్వారా మీ వంతు సాయం అందించాలని కోరింది త్రిష.


Tags: Trisha, Unicef, CoronaVirus, Covid19

Advertisement

Next Story