పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దంటున్న త్రిష

by Shyam |
పెద్దలు కుదిర్చిన పెళ్లి వద్దంటున్న త్రిష
X

దిశ, వెబ్‌డెస్క్: స్మైలింగ్ క్వీన్ త్రిష పెళ్లి కబురు కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. వరుణ్ మణిమన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో పీటల వరకు వచ్చిన పెళ్లిని మధ్యలోనే ఆపేసిన త్రిష … తర్వాత సినిమాలపైనే కాన్సంట్రేట్ చేసింది. శింబు, రానాతో రిలేషన్ షిప్‌లో ఉందనే వార్తలు వచ్చినా లైట్ తీసుకుంది. ఇండస్ట్రీలోకి వచ్చి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న త్రిష… అవకాశాలకు మాత్రం దొరకలేదు. ’96’ మూవీతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నఆమె .. లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూ సక్సెస్‌ఫుల్‌గా కెరియర్‌ను నడిపిస్తోంది. అయితే త్రిష మ్యారేజ్ గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది. కానీ పెద్దలు చూసిన అబ్బాయిని మాత్రం అసలు చేసుకోనని చెప్పింది. కాబోయే భర్త నన్ను అర్ధం చేసుకునే వాడై ఉండాలని.. గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నానని తెలిపింది. హీరోలా అందంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ.. మంచివాడై ఉండాలని తన మనసులో మాటను చెప్పేసింది. అలాంటి వ్యక్తి తారసపడినప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని తెలిపింది.

త్రిష నటించిన ‘పరమపదం విళైయాట్టు’ విడుదలకు సిద్ధంగా ఉండగా… ఈ సినిమా ప్రమోషన్స్‌కు హాజరుకావడం లేదని త్రిషపై ఫైరయ్యారు నిర్మాతలు. నిర్మాతల సంఘం కూడా ఈ విషయంలో హెచ్చరించగా.. మరో ముఖ్యమైన కార్యక్రమం ఉండడం వల్లే తాను ప్రమోషన్స్‌కు హాజరుకాలేదని తెలిపింది. ప్రమోషన్స్‌ను ఎగ్గొట్టే అలవాటు తనకు లేదని ప్రెస్ మీట్ పెట్టి మరి స్పష్టం చేసింది.

tags : Trisha, Trisha Krishnan, Marriage, Love Marriage, Shimbu, Rana

Advertisement

Next Story

Most Viewed