- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లైన నటి కమ్ ఎంపీ.. తండ్రెవరో చెప్పమంటున్న నెటిజన్స్
దిశ, వెబ్‌డెస్క్: బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ తల్లయ్యింది. బుధవారం రాత్రి కోల్‌కతా పార్క్ స్ట్రీట్‌లోని భగీరథి నియోతియాలో చేరిన ఆమె గురువారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్నేహితుడు యష్ దాస్‌గుప్తా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌తో రెండేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న నుస్రత్ 2019, జులై 19న టర్కీలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. అయితే ఈ నేపథ్యంలో నుస్రత్ ని పలు వివాదాలు చుట్టుముట్టాయి. తన భర్త తన వద్ద ఉన్న నగలను, డబ్బును వాడుకున్నాడని, టర్కీలో జరిగిన తమ పెళ్లి ఇండియాలో చెల్లదని ఆరోపణలు చేసి వివాదాలలో చిక్కుకుంది.
Congratulations @nusratchirps wish could hug in personal.
Love and hugs— Mimssi (@mimichakraborty) August 26, 2021
మరో పక్క నిఖిల్ జైన్ సైతం ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి నేను కాదని బహిరంగంగా చెప్పి సంచలనం వ్యాఖ్యలు చేశాడు. ఇక పార్టీ ప్రత్యర్ధులు సైతం నుస్రత్ పై మండిపడ్డారు. భర్తను వదిలి, పెళ్లి కాలేదు అని చెప్పిన మహిళను ఎలా పార్టీలో ఉంచుకుంటారని ప్రశ్నలు వర్షం కురిపించిన విషయం తెలిసిందే. వీటన్నింటిని దాటుకొని నుస్రత్ పండంటి మగబిడ్డకు జన్నివ్వడం సంతోషకరమైన విషయమే అని ఆమె అభిమానులు చెప్తుంటే.. మరికొంతమంది.. నిఖిల్ ని భర్త కాదు అంది.. పెళ్లి అసలు చట్టబద్ధమైందే కాదు అంది.. మరి ఇప్పుడు ఈ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమనండి అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం నుస్రత్.. నటుడు యష్ దాస్‌గుప్తాతో ప్రేమలో ఉన్నట్లు సమాచారం. అతని వలనే నుస్రత్ భర్తకు దూరమైందని వినికిడి.
Follow Disha daily Facebook : https://www.facebook.com/Dishacinema