జోగిపేటలో కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులు..!

by Shyam |
జోగిపేటలో కొండా లక్ష్మణ్‌ బాపూజీకి నివాళులు..!
X

దిశ, ఆందోల్:

స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ వర్దంతిని చేనేత సహకారం సంఘం నిర్వహించింది. సోమవారం జోగిపేటలో చేనేత సహకార సంఘం కార్యాలయంలో అధ్యక్షుడు వర్కల అశోక్ ఆధ్వర్యంలో బాపూజీ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘంలోని కార్మికులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్బంగా వర్కల అశోక్ మాట్లాడుతూ.. జీవిత కాలం తెలంగాణ కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమ కోసం పోరాడిన మహానీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. జోగిపేట చేనేత సంఘం అభివృద్ధి కోసం ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‎ను కలిసి తమ సమస్యలు వివరించామని అన్నారు.

Advertisement

Next Story