- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Remand: లికర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ సర్కార్ (YCP Government) హయంలో జరిగిన లిక్కర్ స్కాం కేసు (Liquor Scam Case)లో సజ్జల శ్రీధర్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు ఇవాళ రిమాండ్ విధించింది. ఈ కేసులో A6గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండీ సజ్జల శ్రీధర్ రెడ్డి (Sajjala Sridhar Reddy)ని సిట్ అధికారులు హైదారాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubilee Hills)లోని ఆయన నివాసంలో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయనను విజయవాడకు తరలించి ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ విధిస్తున్నట్లుగా పేర్కొన్నారు.
కాగా, లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో ప్రధాన సూత్రధారి రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) కమీషన్లు చెల్లించేలా కంపెనీలను బెదిరించడం, ఒత్తిడి చేయడంలో సజ్జల శ్రీధర్ రెడ్డి కీలకంగా వ్యహించినట్లుగా సిట్ గుర్తించింది. ఇదే కేసులో ఇప్పటికే రాజ్ కసిరెడ్డి (A1), ఆయన తోడల్లుడు చాణక్య (A8)ను అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త మద్యం పాలసీని అడ్డు పెట్టుకుని ప్రతినెలా రూ.60 కోట్ల మేర ముడుపులు సేకరించాలనే విషయంలో ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy), విజయసాయి రెడ్డి (Vijayasai Reddy), నాటి ఐటీ సలహాదారు రాజ్ కసిరెడ్డి, ఏపీఎస్‌బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy), ఏపీఎస్‌బీసీఎల్ స్పెషల్ ఆఫీసర్ సత్య ప్రసాద్ (Satya Prasad)తో కలిసి శ్రీధర్‌రెడ్డి కూడా కుట్రలు చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే కేసులో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడం, తాజాగా ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.