- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్ దెబ్బకు వెనకడుగు.. దాడికి మాకు సంబంధం లేదని ట్విస్ట్ ఇచ్చిన TRF

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 22న కశ్మీర్‌లోని పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రవాదులు.. పర్యాటకులకు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడి (terrorist attack)లో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో.. దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ దాడిని తామే చేసినట్లు పాకిస్తాన్‌కు చెందిన TRF ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన అనంతరం భారత్ సహా ఇతర దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమాయక ప్రజలపై చేసిన ఈ ఉగ్రదాడిని సీరియస్‌గా తీసుకున్న భారత ప్రభుత్వం (Government of India) పాకిస్తాన్ పై పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం (War atmosphere) నెలకొంది. ఈ పరిస్థితుల్లో భారత్ కు ప్రపంచంలోని అగ్ర దేశాల నుంచి మద్దతు పెరిగింది.
ఈ నేపథ్యంలో దాడిపై TRF మాట మార్చి ట్విస్ట్ ఇచ్చింది. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఉగ్రసంస్థ (The Resistance Front terrorist organization) ఈ రోజు మరో ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటనలో.. రెండు రోజుల క్రితం మా నుంచి వచ్చిన ప్రకటనతో మాకు సంబంధం లేదని.. భారత్ మా వ్యవస్థల్ని హ్యాక్ చేసి ఆ మెసేజ్ పోస్ట్ చేసిందంటూ సంచలన ఆరోపణలు చేసింది. అలాగే తాము ఇప్పటికే దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, రాజకీయ ప్రయోజనాల కోసం భారత్ ఇలా చేసిందని, ఇది భారత్ కు కొత్త ఏమీ కాదంటూ మాట మార్చింది. కాగా టీఆర్ఎఫ్ తాజా ప్రకటన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మొదట దాడి చేసింది తామేనని గర్వంగా చెప్పి.. ఇప్పుడు చర్యలు తీసుకోవడంతో తమకు సంబంధం లేదని చెప్పడం పిరికిపంద చర్యగా నెటిజన్లు, భారత పౌరులు కామెంట్లు చేస్తున్నారు.