ఏఐ ఆర్‌జేతో ప్రొగ్రామ్ నిర్వహించిన రెడియో స్టేషన్.. శ్రోతల నుంచి భారీగా విమర్శలు

by D.Reddy |
ఏఐ ఆర్‌జేతో ప్రొగ్రామ్ నిర్వహించిన రెడియో స్టేషన్.. శ్రోతల నుంచి భారీగా విమర్శలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆధునిక ప్రపంచంలో రోజుకొక టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) యుగం నడుస్తోంది. ఆరోగ్యం, విద్య, వాణిజ్యం, మీడియా మానవ సంబంధాలు.. ఏ రంగంలో చూసిన ఏఐ టెక్నాలజీ శరంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో టీవీ ప్రసారాల్లో ఏఐ ఆధారిత రోబోలను (AI-based robots) యాంకర్లుగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు (Australia) చెందిన ఓ రేడియో స్టేషన్ ఏఐ ఆర్‌జే (AI Radio Jockey) తీసుకొచ్చింది. అయితే, దీనిపై శ్రోతల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ వార్తను చదివేయండి.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న CADA రేడియో స్టేషన్ ఏఐ హోస్ట్‌ను ఉపయోగించి ఓ కార్యక్రమాన్ని నడిపిస్తోంది. గత ఏడాది నవంబరు నుంచి 'Workdays with Thy' పేరుతో ప్రతి రోజు 4 గంటల పాటు ఈ ప్రోగ్రామ్‌‌‌ను ప్రసారం చేస్తోంది. ఈ షో iHeartRadio యాప్‌లో కూడా శ్రోతల కోసం అందుబాటులో ఉంది. అయితే, ఈ షోను థై (Thy) అనే రేడియో జాకీ నడిపిస్తుందని ప్రతి రోజు మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు ప్రసారమవుతుందని ఆస్ట్రేలియన్ రేడియో నెట్‌వర్క్ (ARN) వివరించింది. కానీ, ఎక్కడ కూడా AIని ఉపయోగించినట్లు ప్రస్తావించలేదు. ఇటీవల ఈ విషయం శ్రోతలకు తెలియటంతో రేడియో స్టేషన్‌ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రసార మాధ్యమాల్లో పారదర్శకత లేకపోతే ఎలా అంటూ మండిపడుతున్నారు.

అయితే, ఈ వివాదంపై ARN ప్రతినిధి ఒకరు స్పందించారు. రేడియో ప్రసారాల్లో AI ఆడియో టూల్స్‌ను ప్రయోగాత్మకంగా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ఈ థై అనే AI వాయిస్‌ను ElevenLabs అనే జనరేటివ్ AI ఆడియో ప్లాట్‌ఫామ్ ద్వారా సృష్టించినట్లు వివరించారు. అలాగే, ఇది టెక్స్ట్‌ను స్పీచ్‌గా మారుస్తుందని చెప్పారు. ఇక తమ ఉద్యోగుల్లో ఒకరి గొంతు ఆధారంగా ఆడియోను రూపొందించినట్లు తెలిపారు. ఈ ప్రయోగం తమకు విలువైన అవగాహనను ఇచ్చిందన్నారు. ఇక AI హోస్ట్ చేసిన ఈ షో గత నెల రేటింగ్స్‌లో కనీసం 72,000 మందిని చేరుకుందని తెలిపారు. అలాగే, ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియన్ వాయిస్ యాక్టర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలు టెరీసా లిమ్.. ప్రసార మాధ్యమాల్లో నిజాయితీ తప్పనిసరి ఉండాలన్నారు. AI నియంత్రణపై చట్టాలు అవసరమని ఈ సందర్భంగా హితవు పలికారు.


Advertisement
Next Story

Most Viewed