- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జాతీయ పతకాలు పొందిన అధికారులకు సత్కారం
by Shyam |

X
దిశ, క్రైమ్‌బ్యూరో: స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని జాతీయ పతకాలను అందుకున్న ఇద్దరు పోలీసు అధికారులను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మంగళవారం ఘనంగా సత్కరించారు. భారత పోలీసు పతకాన్ని పొందిన సైబర్ క్రైమ్ ఏసీపీ చింతలపాటి శ్రీనివాస్ కుమార్, ప్రెసిడెంట్ మెడల్ పొందిన (పీపీఎం) కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు ఎస్ఐ తోట సుబ్రహ్మణ్యంలను గచ్చిబౌలి కమిషనరేట్ కార్యాలయంలో శాలువాతో అభినందించారు. ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ దేశంలో రెండు ప్రతిష్టాత్మకమైన పతకాలకు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు అధికారులు ఎంపికవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో క్రైమ్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని, అడ్మిన్ అడిషనల్ డీసీపీ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story