- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫారెస్ట్ అధికారుల పై గిరిజనుల దాడి.. తీవ్ర గాయాలతో..
దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం ముంబాజిపేట్ తాండలో అటవి అధికారులపై గిరిజనులు దాడి చేశారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. ముంబాజిపేట్ అటవి ప్రాంతంలో గిరిజనులు ట్రాక్టర్లతో అటవి భూమిని చదును చేయడానికి వెళ్లారు. సమాచారం అందుకున్న బీట్ ఆఫీసర్లు ఫిరోజ్ ఖాన్, మహేష్ లు అక్కడికి వెళ్లి వారిని అడ్డుకున్నారు. దాంతో ఆగ్రహించిన గిరిజనులు వారిపై దాడి చేశారు. అక్కడే ఉన్న మరో అధికారి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం అందించాడు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హుటాహుటిన గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అటవీ అధికారుల పై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో కొండాపూర్ శివారులో గిరిజన దాడిలో గాయపడిన బీట్ ఆఫీసర్లను డిఎఫ్ వో నిఖిత, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరామర్శించారు.