పాడి పంటలను చల్లగా చూడమ్మా

by Shyam |
పాడి పంటలను చల్లగా చూడమ్మా
X

దిశ, హుస్నాబాద్: పాడి పంటలు చల్లగా చూడాలని శీత్లా భవాని ఉత్సవాల్లో గిరిజనులు అమ్మావారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం అక్కన్నపేట మండలం మసిరెడ్డి తండాలో గిరిజనులు శీత్లాభవాని ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా శ్రావణంలో పశు సంరక్షణ, పంటలు వేసిన నాటి నుంచి కోతకచ్చే వరకూ ప్రకృతి విపత్తుల నుంచి రక్షించడంతో పాటు తండాలోని గిరిజనులు వ్యాధుల బారిన పడకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. అంతేగాకుండా ఏడుగురి బంజార దేవతలకు పప్పు దినుసుల నైవేద్యాలు కోళ్లు, మేకలు కోసి అమ్మావారికి సమర్పించడం ఆనవాయితిగా వస్తుందన్నారు. గిరిజన లంబాడీలలో ప్రతి ఏడాది ఒక్కసారి జరిగే శీత్లా భవాని ఉత్సవాలను అత్యంత పవిత్రమైన పండగగా భావిస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed