నోటిసులు అంటిస్తే ఊరుకోం.. ఆదివాసీల ఆగ్రహం

by Shyam |
నోటిసులు అంటిస్తే ఊరుకోం.. ఆదివాసీల ఆగ్రహం
X

దిశ, అచ్చంపేట : ఏజెన్సీ ప్రాంతమైన అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలో మరోసారి పోడుభూముల విషయంలో కలకలం రేగింది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని మాచారం గ్రామానికి అటవీశాఖ అధికారులు పోడు భూములను సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు నోటీసు ఇచ్చేందుకు రావడం జరిగింది. ఆదివాసీలు నోటీసులు తీసుకోవడానికి నిరాకరించడంతో వారి ఇళ్లకు నోటీసులు అట్టించేందుకు వచ్చిన అటవీశాఖ అధికారులను ఆదివాసీ గిరిజన మహిళలు అడ్డుకున్నారు. నోటీసులు అంటించేది లేదు… మా ప్రాణాలు పోయినా సరే ఆగేది లేదని అడ్డుతగిలారు. బతకడం కోసం సారేడు అటవీ భూమిని సాగు చేసుకుంటే అటవీ శాఖ అధికారులు మాతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీశాఖ అధికారులు మమ్ముల్ని భయబ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. దీంతో అటవీశాఖ అధికారులకు ఆదివాసీలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

Advertisement

Next Story

Most Viewed