- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బోరుబావి సీజ్.. రైతు ఆత్మహత్యాయత్నం
దిశ, హుస్నాబాద్: రెవెన్యూ అధికారులు బోరు బావిని సీజ్ చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన గుగులోతు రమేశ్ అనే రైతు గతంలో తన పొలంలో బోరుబావి వేయగా, పరిసర రైతులు వాల్టా చట్టానికి వ్యతిరేకంగా బోరుబావి వేశాడని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. చేతికొచ్చిన పంట ఎండిపోతోందని రైతు రమేష్ పక్కనే ఉన్న మరోబావిలోకి మోటారు దింపాడు. సదరు రైతులు మరోమారు ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ బోరుబావిని సోమవారం సీజ్ చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రైతు రమేశ్ పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు.
రైతు పరిస్థితి విషమం
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రైతు రమేశ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. రమేశ్ ఆత్మహత్యాయత్నానికి కారకులైన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు మంగళవారం ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.