- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రయల్ రన్ సక్సెస్.. మెడిసిన్ డ్రోన్ డెలివరీకి మార్గం సుగమం
దిశ, ఫీచర్స్: అత్యవసర పరిస్థితుల్లో లైఫ్ సేవింగ్ డ్రగ్స్ డెలివరీకి డ్రోన్లను ఉపయోగించేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా బెంగళూరులో మెడిసిన్స్ డ్రోన్ డెలివరీకి సంబంధించి నిర్వహించిన బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్(BVLOS) ట్రయల్ రన్ విజయవంతమైంది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) పర్యవేక్షణలో త్రోటిల్ ఏరోస్పేస్ సిస్టమ్స్ (TAS), UDAN(ఉడే దేశ్ కా ఆమ్ నాగ్‌రిక్) ద్వారా పైలట్ పరీక్షించబడింది. బెంగళూరు ప్రాంతంలోని గౌరీబిడనూర్ వద్ద 15 కి.మీల పరిధిలో UDAN ఈ ట్రయల్ నిర్వహించింది.
ఈ పైలట్ ట్రయల్‌లో భాగంగా.. మెడ్‌కాప్టర్ X4, మెడ్‌కాప్టర్ X8 అనే రెండు రకాల డ్రోన్లు విజయవంతంగా డెలివరీ చేశాయి. ముందుగా నిర్దేశించిన ప్రాంతాల్లో దాదాపు 2-7 కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్ మేర దాదాపు 2 కిలోల పేలోడ్ కలిగిన ఫార్మా డెలివరీస్‌తో ఈ టెస్ట్ నిర్వహించారు. ట్రయల్ రన్‌లో పైలట్లు 3.5 కి.మీ దూరాన్ని 5-7 నిమిషాల్లో చేరుకున్నాయి. దీంతో సరైన రోడ్డు మార్గంలేని ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోని ట్రాఫిక్ రద్దీగల రూట్లకు డ్రోన్ల ద్వారా మెడిసిన్ డెలివరీపై దృష్టిసారించే అవకాశం ఉంది. ఈ ఫలితాలు వాణిజ్యపరంగా అందుబాటులోకి వస్తే.. మారుమూల ప్రాంతాలకు సాధారణ డెలివరీలతో పాటు ప్రకృతి విపత్తులు, పాండమిక్ సిచ్యువేషన్స్ లేదా వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో లైఫ్ సేవింగ్ మెడిసిన్‌ను క్షణాల్లో డెలివరీ చేసే వీలుంటుంది.
‘ఈ ట్రయల్ రన్ సక్సెస్.. డిస్ట్రిబ్యూషన్, లాజిస్టిక్స్ స్పేస్‌లో కస్టమర్ల అనుభవాన్ని విప్లవాత్మకంగా మార్చడానికి భారీ అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న కిరాణాలు, దుకాణా యజమానులు, కెమిస్ట్స్, MSME తదితర చిన్న వ్యాపారాలకు సాధికారత కల్పించడానికి టెక్-ఎనేబుల్డ్ సొల్యూషన్స్‌ను నిర్మించాలనే మా విజన్‌కు ఇది అనుగుణంగా ఉంది’ అని ఉడాన్ ప్రొడక్ట్ ఇంజనీర్ సౌమ్యదీప్ ముఖర్జీ అన్నారు.