వెబ్ సిరీస్ తరహాలో కారులోంచి కరెన్సీ విసిరిన యువకులు.. (వీడియో)

by Sathputhe Rajesh |
వెబ్ సిరీస్ తరహాలో కారులోంచి కరెన్సీ విసిరిన యువకులు.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ వెబ్ సిరీస్‌లోని సన్నివేశాన్ని తలపించేలా ఇద్దరు యువకులు కారులోంచి కరెన్సీ నోట్లు విసిరిన ఘటన హరియాణాలోని గురుగ్రామ్‌లో కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గురుగ్రామ్‌లోని గోల్ఫ్ కోర్స్ రోడ్డులో ఇద్దరు యువకులు కారులో ప్రయాణిస్తున్న సమయంలో ఒకరు వాహనం నడుపుతుండగా మరొకరు కారు వెనకభాగం నుంచి రోడ్లపై కరెన్సీ నోట్లు విసిరాడు.

నోట్లు విసిరిన వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని కనిపించాడు. అయితే విసిరిన నోట్లు ఒరిజినలా? లేక నకిలీవా తెలియాల్సి ఉంది. ఢిల్లీకి చెందిన ఓ యూ ట్యూబర్ ఇలా చేసినట్లు తెలిసింది. ఇటీవల విడుదలపై ఫర్జీ వెబ్ సిరీస్‌లోని ఓ సన్నివేశంలోనూ ఇద్దరు కారులోంచి నకిలీ కరెన్సీ నోట్లను రహదారిపైకి విసురుతూ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు యత్నిస్తారు. ఆ సీన్‌ను అనుకరించే క్రమంలో డబ్బులు విసిరిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Next Story