Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి దూరిన సింహం.. తర్వాత ఏమైందో తెలిస్తే షాకవ్వాల్సిందే!?

by Jakkula Mamatha |
Viral Video: పెట్రోల్ బంక్‌‌లోకి దూరిన సింహం.. తర్వాత ఏమైందో తెలిస్తే షాకవ్వాల్సిందే!?
X

దిశ,వెబ్‌డెస్క్:ప్రస్తుతం సోషల్ మీడియాలో జంతువులకు(animals) సంబంధించిన వీడియోలు వైరల్(Viral) అవుతూనే ఉన్నాయి. పులులు, సింహాలు, పాములు, ముంగిసలకు సంబంధించిన వీడియోలు అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ నేపథ్యంలో అడవుల్లో ఉండే పులులు(Tigers), సింహాలు(lions) జనావాసాల్లోకి చొరబడడం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇలాంటి సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని సార్లు మనుషులపై దాడి చేస్తే.. మరికొన్నిసార్లు జంతువుల(animals) పై దాడి చేస్తుంటాయి. ఇంకొన్నిసార్లు అయితే ప్రజలను భయభ్రాంతులకు(Panic) గురి చేసి పరుగులు పెట్టిస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే..అడవిలో హాయిగా తిరిగే ఓ సింహం జనవాసాల్లోకి వచ్చింది. ఆ సింహానికి ఎక్కడకి వెళ్లాలో తెలియాక అక్కడే ఉన్న పెట్రోల్ బంక్‌లోకి(petrol bunk) దూరింది. లోపలికి వెళ్ళేటప్పుడు ఎంతో గంభీరంగా నడుస్తూ వెళ్లిన సింహం మళ్లీ రోడ్డు పైకి తిరిగి వచ్చేటప్పుడు నెమ్మదిగా నడుస్తూ వస్తుంది. ఈ సమయంలో అక్కడే ఉన్న పెట్రోల్ బంక్(petrol bunk) సిబ్బంది ఆ సింహాన్ని చూసి భయంతో వణికిపోతాడు. బంక్ లోకి వెళ్లిన ఆ సింహం చివరకు లోపలికి రాకుండా మళ్లీ రోడ్డు పైకి వెళ్లడంతో ప్రమాదం లేదనే చెప్పవచ్చు. అర్ధరాత్రి సమయం కావడంతో అక్కడ వాహనాలు కానీ మనుషులు కానీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed