- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: 'మా ముందు నువ్వేంతా..' చిరుతను ఊపిరి ఆడకుండా చేసిన పందులు

దిశ, వెబ్ డెస్క్: 'నాన్నా.. పందులే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్‌గా వస్తుంది' అన్నది ఓ తెలుగు సినిమాలోని పాపులర్ డైలాగ్. అయితే, పందులు గుంపుగా వస్తే ఎంతటి పెద్ద జంతువునైనా ఓ తోక ముడుచుకోవాల్సిందేనని ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే?
ఓ అడవి మధ్యలోని రహదారిపై పందుల గుంపు చిరుత పులి కూనపై దాడి చేశాయి. చిరుత పులిని కిందపడేసి కొరకటం ప్రారంభించాయి. దీంతో ఈ చితా ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. వాటి నుంచి తప్పించుకునేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ విఫలమైంది. 'మా ఐకమత్యం ముందు నీ బలం పనికిరాదన్నట్టుగా..' చిరుతపులిని ఓ ఆట ఆడుకున్నాయి. ఇదంతా అక్కడ దగ్గర్లో బస్సులో ఉన్న వారు వీడియో తీయగా.. 11 సెకన్ల ఉన్న ఆ వీడియోను Nature Is Cruel అనే ఎక్స్ (x) పేజీలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. 'పందులతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది', 'ఐకమత్యం అంటే ఇదే..' అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.