- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైక్ దొంగలను సెక్యూరిటీ గార్డ్ తెలివిగా ఎలా పట్టుకున్నాడో చూడండి (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: బైక్ వాడకం ఎలా పెరిగిందో.. వాటిని దొంగలించే వారు కూడా అలానే పెరిగిపోతున్నారు. బైక్‌తో పాటుగా చైన్ స్నాచింగ్‌కు పాల్పడే వ్యక్తుల సంఖ్య కూడా పెరిగిపోతోంది. ఈ మధ్య ఇవి రెండు ఎక్కువగా అన్ని ప్రదేశాల్లో జరుగుతుండటం సామాన్య జనాలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. కాగా, ఇలాగే ఢిల్లీలో ఇద్దరు బైక్ దొంగల చాలని అనుకున్న అట్టే దొరికి పోయారు. డెలివరీ చేసే వ్యక్తి దక్షిణ ఢిల్లీలోని ఎవరెస్ట్ అపార్ట్‌మెంట్‌కి వచ్చినప్పుడు డోర్ బెల్ మోగించడానికి వెళ్ళాడు. కానీ బైక్ కీ మర్చిపోయాడు. దొంగలు అవకాశాన్ని చూసి బైక్‌ను స్టార్ట్ చేసిన త్వరగా పారిపోయేందుకు ప్రయత్నించారు.
ఇది చూసిన డెలివరీ బాయ్ కేకలు వేయడంతో సెక్యూరిటీ గార్డు అలర్ట్ అయి గేట్లను వెంటనే మూసి వేస్తుండగా గ్యాప్ లోంచి పారిపోయే ప్రయత్నం చేశారు. కానీ వేగంగా వచ్చిన బైక్ గేట్‌ను ఢీ కొట్టడంతో అక్కడే పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వెంటనే దొంగల్లో ఒకరిని పట్టుకోగా, మరొకరు పారిపోయారు. ఈ తతంగం అంతా సీసీ కెమెరాల్లో రికార్డ్ అవటంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారు అందరూ సెక్యూరిటీ గార్డ్‌ను ప్రశంసిస్తున్నారు.