- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral Video: అడుగు పెట్టగానే కుంగిపోయిన నేల.. లోపల తొంగి చూడగా దిమ్మతిరిగే సీన్.. ధైర్యం ఉన్నవాళ్లకి మాత్రమే
దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి వివిధ రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు మాత్రం మన కళ్ళను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు అవుతోంది.
న్యూయార్క్‌లో జరిగిన ఘటన ప్రకారం.. ఓ వ్యక్తి రోడ్డు పక్కన నడుస్తూ వెళ్తుండగా.. సడెన్‌గా ఓ ప్రాంతంలో అడుగు పెట్టగానే ఉన్నట్టుండి భూమి కుంగిపోయి రంధ్రం ఏర్పడింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అందులో ఏముందా అని తెలుసుకునేందుకు లోపలికి తొంగి చూశాడు. అలా లోపలికి చూడగా సొరంగం ఉన్నట్లు కనిపిస్తుంది. దీంతో అందులోకి కెమెరా పంపించాడు. దీంతో లోపల పైప్ లైన్ తరహాలో నిర్మాణం కనిపించింది. అందులోకి వెళ్లి చూడగా లోపల కళ్లు జిగేల్‌మనే దృశ్యం కనిపిస్తుంది. ఓ పెద్ద హాల్ కనిపిస్తుంది. అందులో చాలా మంది కూర్చుని వేడుకలు తిలికేందుకు వీలుగా నిర్మించారు. అలాగే ఈ హాలు పక్కన అనేక గదులు కూడా కనిపించాయి.
ఆ గదుల మధ్యలో వైర్, పైప్ కనెక్షన్ కూడా చూడొచ్చు. ఈ రహస్య గదులను చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది చూసిన నెటిజన్లు.. కొందరు ''న్యూయార్క్‌లో సొరంగాలు బయటపడ్డాయంటే నమ్మలేకున్నాం.. అంటే ఈ నగరం మొత్తం సొరంగాల పైన నిర్మించారా''.. అని అంటుంటే మరికొందరు మాత్రం వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ వీడియో ప్రస్తుతం 14 లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
(video link credits to decayingmidwest instagram id)