- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral video: ఫేర్‌వెల్ పార్టీకి ఈ విద్యార్థులు ఎలా వెళ్లారో చూడండి.. మండిపడుతున్న నెటిజన్లు

దిశ, వెబ్ డెస్క్: విద్యాభ్యాసం ముగిసే సమయంలో విద్యార్థుల కోసం పాఠశాలలు ఫేర్‌వెల్ పార్టీలు నిర్వహిస్తుంటాయి. ముఖ్యంగా బోర్డు పరీక్షల ఒత్తిడిని దూరం చేసేందుకు విద్యార్థులు కోసం వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇక విద్యార్థులు కూడా ఆ రోజు ఎంతో సరదాగా, ఆనందంగా గడుపుతారు. తమ స్నేహితులతో ఉన్న మెమోరిస్ గుర్తు చేసుకుని, వారిని విడిచి వెళ్లాల్సి వస్తుందని ఎమోషనల్ అవుతారు. ఇది అంతా ఎక్కడైనా సాధారణంగా జరుగుతుంటాయి. అయితే, ఓ పాఠశాలలో నిర్వహించిన ఫేర్‌వెల్ పార్టీకి విద్యార్థులు ఇచ్చిన చూస్తే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..
గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని (Surat) ఓ ప్రముఖ స్కూలు 12వ తరగతి విద్యార్థుల కోసం వీడ్కోలు పార్టీ (Farewell) ఏర్పాటు చేసింది. అసలే ధనవంతుల పిల్లలు.. పాఠశాలలో పార్టీ అంటే రచ్చ మాములుగా ఉంటుందా. ఈ పార్టీకి 12వ తరగతి విద్యార్థులంతా దాదాపు 35 హై ఎండ్ లగ్జరీ కార్లతో పరేడ్ (luxury car rally) నిర్వహించారు. బెంజ్, ఆడీ, స్కోడా, బీఎమ్‌డబ్ల్యూ, పోర్చే, రేంజ్ రోవర్, ఫార్చూనర్, మహీంద్రా స్కార్పియో వంటి ఖరీదైన కార్లలో పార్టీకి వెళ్తూ సందడి చేశారు. సన్‌రూఫ్ ద్వారా బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ, సెల్ఫీలు దిగారు. అంతేకాదు, ఈ దృశ్యాలను మొత్తం చిత్రీకరించేందుకు డ్రోన్ కెమెరాలను సైతం వినియోగించారు.
ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ప్రస్తుతం వైరల్ అవుతోన్నాయి. అయితే, ఇది చూసిన నెటిజన్లు విద్యార్థులపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ ఎలా ఇచ్చారంటూ విద్యార్థుల తల్లిదండ్రులపై ఫైర్ అవుతున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని యాక్షన్ తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
સુરતમાં આ તે કેવું ફેરવેલ…?, ધોરણ 12 ના વિદ્યાર્થીઓ નીકળ્યા લગઝરી કારના કાફલા સાથે…..#surat #suratcity #suratcitypolice #suratpolice #student #students #car #cars #trending #tranding #breakingnews #viralnews #newsupdate #viral #tras #vehicle #shandarrajkot pic.twitter.com/4alFHamuj1
— Shandar Rajkot (@ShandaRajkot) February 10, 2025