- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: అదృష్టవంతుడివి రా బాబు! రెండు బస్సుల మధ్య ఇరుక్కున్నా ప్రాణాలతో ఎలా?
దిశ, డైనమిక్ బ్యూరో: కొంత మంది అనుకోని ప్రమాదం సంభవించి తృటిలో ప్రాణాలతో బయట పడుతుంటారు. అలాంటి కళ్లు చెదిరిపోయే సంఘటననే తాజాగా జరిగింది. రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయిన వ్యక్తి ఎలాంటి గాయలు లేకుండా ప్రాణాలతో బయట పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళనాడులో ఈ ఘటన చోటుచేసుకుంది. పట్టుకొట్టాయ్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. తన ముందు ఓ బస్సు వెళ్లి పోతుందనుకున్న క్షణంలో రోడ్డు మధ్యలోకి చేరుకుంటాడు. సింగిల్ రోడ్డు కావడం అటువైపుగా ఇంకో బస్సు క్షణాల్లో అతని పక్కగా వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో రెండు బస్సుల మధ్య ఇరుక్కుపోయి చివరికి రోడ్డుపై పడిపోతాడు. అదృష్టవశాత్తు అతనికి ఒంటిపై ఎలాంటి గాయాలు కాకుండా బయటపడుతాడు.
వెంటనే బస్సు దిగి కొంత మంది అక్కడి చేరుకునే లోపే అతనికి ఏమీ కానట్లుగా లేచి వెళిపోతాడు. ఈ వ్యవహారమంతా బస్సు సైడ్ కెమెరాల్లో రికార్డ్ అయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో అదృష్టవంతుడివి రా బాబు అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు ఇందులో అటువైపుగా వచ్చే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును నడుపుతున్నారని నెటిజన్లు ఆరోపించారు.