Viral Video: ఛీ ఛీ.. రన్నింగ్ బైకు మధ్యలో కూర్చుని ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వీడియో)

by Kavitha |   ( Updated:2024-08-04 05:36:30.0  )
Viral Video: ఛీ ఛీ.. రన్నింగ్ బైకు మధ్యలో కూర్చుని ముద్దులతో రెచ్చిపోయిన ప్రేమ జంట.. (వీడియో)
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని యువత ఎంత దిగజారిపోతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ క్రమంలో ఈ జనరేషన్ పిల్లలు స్కూల్ వయస్సు నుంచి ప్రేమాయణాలు స్టార్ట్ చేస్తూ.. లవ్ ఎఫైర్‌లు పెట్టుకుంటున్నారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. ఇష్టమొచ్చినట్లు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కొంత మంది అయితే లివింగ్ రిలేషన్‌లో ఉంటూ పెళ్లికి ముందే చేయరాని పనులన్ని చేసేసుకుని తర్వాత సెట్ అవ్వలేదు అని ఈజీగా బ్రేకప్‌లు చెప్పేసుకుంటున్నారు. ఇలా ప్రేమకు, ఆకర్షణకు మధ్య తేడా తెలుసుకోలేక తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువతీ, యువకులు రోడ్డుపైన రొమాన్స్ చేసుకుంటున్న వీడియోలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. రన్నింగ్ బైక్‌లు, కార్లలలో రొమాన్స్ చేసుకుంటూ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కోవకు చెందిన ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో.. రోడ్డుమీద ఒక యువకుడు బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. మరో ఇద్దరు ప్రేమికులు అతగాడి వెనక కూర్చున్నారు. ఇంతలో ఇద్దరు కలిసి ముద్దులు పెట్టుకుంటూ రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా.. బైక్ మీద ఉన్న కూడా ఏమాత్రం తగ్గకుండా ముద్దులు పెట్టుకుంటునే ఉన్నారు. ఈ క్రమంలో యువతి కూడా ఏ మాత్రం సిగ్గు శరం లేకుండా.. ఆ యువకుడిని గట్టిగా పట్టుకుని లిప్ లాక్ ఇచ్చింది. అంతటితో ఆగకుండా వీళ్ల భాగోతాన్ని సోషల్ మీడియాలో కూడా పెట్టేశారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్ అయింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మాత్రం రోడ్డుపైన డ్రైవింగ్ చేసేటప్పుడు ఇదేం పాడుపని అని.. అంత ఆగలేక పోతున్నారా అని.. అసలు అమ్మాయి అయి ఉండి రోడ్ల మీద అలాంటి పాడు పని చేయడానికి సిగ్గులేదా అంటూ కామెంట్ల రూపంలో ఏకిపారేస్తున్నారు. కాగా raja_i_n_s_t 5464 అనే వీరి అకౌంట్‌లో అన్ని ముద్దులు, రొమాన్స్‌లు చేస్తున్న వీడియోలే ఉండటం గమనార్హం.

(video link credits to raja_i_n_s_t 5464 instagram id)

Advertisement

Next Story

Most Viewed