Viral: బడి పిల్లల సేవలో సేదతీరుతున్న పంతులమ్మ పై నెట్టింట విమర్శలు!

by Ramesh Goud |
Viral: బడి పిల్లల సేవలో సేదతీరుతున్న పంతులమ్మ పై నెట్టింట విమర్శలు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బడి పిల్లల సేవలో సేదతీరుతున్న పంతులమ్మ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. సాధారణంగా ఏ స్కూల్ లో అయినా టీచర్ పాటాలు చెబితే.. పిల్లలు అది విని నేర్చుకుంటారు కానీ గోకుల్ పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యాబుద్దులు నేర్పించాల్సిన టీచర్ పడుకొని సేద తీరుతుండగా.. పిల్లలు ఆమెకు సేవకులుగా మారారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో మహిళా టీచర్ క్లాస్ రూంలో పడుకొని ఉండగా.. విద్యార్ధులు ఆమె చుట్టూ చేరి విసనకర్రలతో ఒకరి తర్వాత ఒకరు గాలి ఊపుతున్నారు.

దీనిని ఓ వ్యక్తి నెట్టింట పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ గా మారడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తూ.. పిల్లలను చదువుకునే పిల్లలను కష్టపెట్టడం అమానుషం అని, దీనిపై అలీఘర్ విద్యా శాఖ అధికారులు స్పందించి మహిళా టీచర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతుండగా.. మరికొందరు మేడమ్ పిల్లలకు యోగా నేర్పిస్తుందని, దీనిపై విద్యాశాఖ అధికారులు స్పందించి ఆమె సేదతీరేందుకు క్లాస్ రూంలో ఒక కూలర్ లేదా ఏసీని పెట్టించాలని వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.



Next Story

Most Viewed