- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మొబైల్ ఫోన్ మాయాజాలం.. ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి.. సజ్జనార్ ట్వీట్ వైరల్

దిశ, వెబ్‌డెస్క్: ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న వస్తువు మొబైల్ ఫోన్. ప్రతి ఒక్కరు చేతిలో ఫోన్లు పట్టుకుని తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు. ఫోన్ చూస్తూ రోడ్లు దాటడం, డ్రైవింగ్ చేయడం లాంటివి చేసి ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఓ మహిళ ఫోన్ నడుస్తూ ఫోన్ చూడటంతో డ్రైనేజ్‌లో పడిపోయింది.
దీనికి సంబంధించిన వీడియోను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ మేరకు.. ‘‘మొబైల్ ఫోన్ మాయాజాలం! ముందు వెనుక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి’’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కాగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మొబైల్ ఫోన్ మాయజాలం!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 28, 2023
ముందు వెనక చూడకుండా ఫోన్ వాడుకుంటూ వెళ్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఫోనే జీవితం కాదు కదా. పొద్దస్తమానం ఫోన్ వాడకాన్ని తగ్గించండి. అవసరానికే వినియోగించండి. pic.twitter.com/FEH2EcNiit
VC Sajjanar's tweet on cell phone usage