- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vande Bharat: ‘వందే భారత్’ అయితే ఏంటి? మాకు అన్ని రైళ్లు ఒక్కటే..
దిశ, డైనమిక్ బ్యూరో: భారత రైల్వే ప్రయాణికులకు రద్దీ అనేది అతి పెద్ద సమస్య. కొన్ని రైళ్లలో నిలబడడానికి కూడా చోటు ఉండదు. ముఖ్యంగా రిజర్వ్ కంపార్ట్‌మెంట్స్‌లో జనరల్ టికెట్ ఉన్నవారు ఎక్కడం.. టికెట్ లేని వారు ఎక్కడం.. జనరల్ కోచ్‌ల సంఖ్య తగ్గించడం, కొన్ని ప్రాంతాలకు రైళ్ల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల రద్దీకి ప్రధాన కారణమవుతున్నాయి. మరోవైపు మెట్రో ట్రైన్స్, లోకల్ ట్రైన్స్‌లో సైతం రద్దీ ఎక్కువే ఉంటుంది. ఇరుక్కుని మరి గందరగోళ వాతావరణంలో జర్నీలు చేయాల్సి వస్తుంది. ఈ క్రమంలో ప్రతిష్టాత్మకంగా కేంద్రం తెచ్చిన వందే భారత్ రైలులో కూడా ఇదే సమస్య ఎదురైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
లక్నో జంక్షన్, డెహ్రాడూన్ మధ్య నడిచే వందేభారత్‌లో ప్రయాణికులతో పూర్తిగా నిండిపోయి కనిపించారు. నిలబడే స్పేస్ లేకుండా కిక్కిరిసిపోయింది. కేవలం ఉన్న సీట్ల వరకే ప్రయాణికులతో ఉండే వందే భారత్ ప్రయాణికులతో కిటకిటలాడింది. అయితే వీరు ట్రైన్ టికెట్ లేకుండా వందే భారత్ రైలులో ప్రయాణం చేస్తున్నారని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వందే భారత్ ట్రైన్ అయితే ఏంటి? ఏ రైళ్లు అయిన మాకు సాధరణ రైలు మాదిరే అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైళ్ల సంఖ్యను పెంచాలని కేంద్ర రైల్వే మంత్రిని నెటిజన్లు కోరుతున్నారు.