- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Viral: పేరు చూసి మహిళ అకౌంట్ బ్లాక్ చేసిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ.. చివరికి..?
దిశ వెబ్ డెస్క్: ఉబర్ ఈట్స్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చేందుకు ఓ మహిళ ప్రయత్నించగా ఉబర్ సంస్థ ఆ మహిళ అకౌంట్‌ను బ్యాన్ చేసింది. ఆ మహిళ పేరులో స్వస్తిక అని ఉండడమే దీనికి కారణం. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన స్వస్తిక చంద్ర అనే మహిళ ఫీజీలో పుట్టిపెరిగింది. కాగా ఆమె ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె గత ఏడాది అక్టోబర్‌లో ఊబెర్ ఈట్స్ ద్వారా ఫుడ్ ఆర్డరిచ్చేందుకు ప్రయత్నించింది.
అయితే ఆ మహిళ పేరులో స్వస్తిక అని ఉండడంతో, ఆ పేరును హిట్లర్ నాజీ సంకేతంగా భావించి ఆమె ఆర్డర్ తీసుకునేందుకు యాప్ తిరస్కరించింది. ఒకవేళ ఆర్డర్ చెయ్యాలి అని అనుకుంటే పేరు మార్చాలని పేర్కొంది. అందుకు ఆమె నిరాకరించడంతో మహిళ అకౌంట్‌పై నిషేధం విధించింది. ఉబర్ సంస్థ తీరుకు ఆగ్రహానికి గురైన మహిళ న్యాయ పోరాటం ప్రారంభించింది. పోరాటంలో భాగంగా ఆస్ట్రేలియాలోని వివిధ హిందూ సంస్థల ద్వారా హిందూ సంప్రదాయంలో స్వస్తిక పేరుకు ఉన్న ప్రాముఖ్యతను అందరికీ తెలిసేలా చేసింది.
చివరికి ఉబర్ సంస్థ దిగివచ్చి ఆ మహిళకు క్షమాపణలు తెలిపింది. అలానే ఆ మహిళ ఖాతాను పునరుద్ధరించింది. ఈ నేపథ్యంలో ఆ మహిళ మాట్లాడుతూ.. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ మతానికి చెందిన పదాన్ని హిట్లర్ 1920ల్లో తనకు అనుకూలంగా మార్చుకున్నాడని స్వస్తిక చంద్ర పేర్కొంది. ఆ విషయం ఉబర్‌కి తెలీదని అందుకే అలా ప్రవర్తించింది అని తెలిపింది.