Trending: తాడు తెగి లోయలో పడిన హెలికాప్టర్.. నెట్టింట్లో వీడియోలు వైరల్

by Shiva |
Trending: తాడు తెగి లోయలో పడిన హెలికాప్టర్.. నెట్టింట్లో వీడియోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: పాడైపోయిన హెలికాప్టర్‌‌ను మరో ఛాపర్ తరలిస్తుండా ప్రమాదవశాత్తు హెలికాప్టర్ లోయలో పడిన ఘటన ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కేదార్‌నాథ్‌లో ఆర్మీ హెలికాప్టర్ పూర్తిగా దెబ్బతిన్నది. అయితే, దానిని అక్కడి నుంచి తరలించి మరమ్మతులు చేపట్టేందుకు ఆర్మీ సిబ్బంది ఎంఐ-17 ఛాపర్ తెప్పించారు. అనంతరం పాడైన హెలికాప్టర్‌ను తాళ్లు, తీగలతో ఆ ఛాపర్ కట్టి తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఛాపర్‌కు కట్టిన తాళ్లు, తీగలు తెగడంతో హెలికాప్టర్ లోయలో పడిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed