- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: ప్రయాణికుల ఆభరణాలు కొట్టేసిన ఆర్టీసీ డ్రైవర్.. నెట్టింట్లో వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా ఆర్టీసీ (RTC) బస్సుల్లో ప్రయాణికులు ఒక్కోసారి కిక్కిరిసి ప్రయాణిస్తుంటారు. కనీసం కూర్చోవడానికి స్థలం లేక వెంట తచ్చుకున్న లగేజీని ఏదో మూలన పెట్టి నిల్చుంటారు. ఆ క్రమంలో తరచుగా ప్రయాణికులు తమ వస్తువులను బస్సులోనే మర్చిపోతుంటారు. మానవతా ధృక్పథంతో చాలా మంది కండక్టర్లు (Conductors), డ్రైవర్లు (Drivers) నిజాయితీగా వస్తువులను డిపో డీఎం (Depot DM)కు లేదా సమీప పోలీస్ స్టేషన్ల(Police Stations)లో అప్పగించి తమ నిజాయితీని చాటుకుంటారు. కానీ, ఇప్పుడు చెప్పే మ్యాటర్ రోటీన్‌కు భిన్నంగా జరిగింది.
తాజాగా, ఆర్టీసీ బస్సులో వరంగల్ (Warangal) నుంచి ఓ మహిళ నిజామాబాద్ (Nizamabad)కు వెళ్తుంది. అయితే, తన బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్‌ను సదరు మహిళ, డ్రైవర్ సీటు వెనకాలే భద్రంగా పెట్టింది. ఈ క్రమంలోనే ఆ బ్యాగ్‌పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్‌గా నొక్కేశాడు. అయితే, ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్‌ఫోన్‌లో రికార్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు బస్సు డ్రైవర్‌ను ప్రశ్నించగా.. మొదట కింద పడితే తీసుకున్నా అంటూ బుకాయించాడు. ఆ తరువాత వీడియో చూపించి నిలదీయగా తానే తీశానని తప్పును ఒప్పుకున్నాడు. ప్రయాణికులు భద్రత కల్పించాల్సిన ఉద్యోగి ఇలాంటి పనులకు పాల్పడుతుండటంతో సదరు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.