Trending: 1.8 KM దూరానికి ఏకంగా రూ.700 .. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్

by Kavitha |
Trending: 1.8 KM దూరానికి ఏకంగా రూ.700 .. నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్
X

దిశ, ఫీచర్స్: గతంలో మనం ఎక్కడికైనా జర్నీ చేయాలంటే కేవలం బస్సులు, రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మారుతున్న కాలానికి అనుగుణంగా చిన్న దూరాల కోసం ఆటోలు, కార్లు తదనంతరం పుట్టుకొచ్చాయి. సాంకేతికత మరింత విస్తరించిన నేపథ్యంలో ఓలా, ఉబెర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ సంస్థలు పురుడు పోసుకున్నాయి. ఈ రంగంలో పోటీదారులు ఎక్కువగా లేకపోవడంతో.. వారు చెప్పిందే వేదంగా ఆ సంస్థలు చలామణి అవుతున్నాయి. దీనిపై బాహాటంగానే ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఆయా సంస్థలు తమ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాయి అని అనడానికి ఉదాహరణగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది.

బేసిక్‌గా చాలా మంది బస్సులలో బాగా రష్ ఎక్కువగా ఉంటటం వల్ల క్యాబ్, బైక్ వంటి వాటిని ఓలా, ర్యాపిడో, ఉబెర్ వంటి యాప్స్‌లో బుక్ చేసుకుంటారు. ఆ విధంగానే ఓ ప్రయాణికుడు కూడా 1.8 KM దూరానికి కారును బుక్ చేసుకున్నాడు. మహా అంటే ఆ దూరానికి ఎక్కువలో ఎక్కువ రూ.50 వేసుకుందాము. ఒకవేళ వర్షం వస్తుంటే కనుక ట్రాఫిక్ అంతరాయం ఉంటుంది కాబట్టి ఓ రూ.100 ఛార్జ్ చేయవచ్చు. కానీ, ఈ ప్రయాణికుడికి ఆ డిస్టెన్స్‌కు ఏకంగా రూ.699 రేటు చూపించిందట. దీంతో అతను ఆ ధర పట్టికను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఢిల్లీలో 1.8 KMల దూరానికి కారు సర్వీసుకు ఏకంగా రూ. 699 రేటు చూపుతుంది అని క్యాప్షన్ జోడించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed