Trending: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన AI రోబో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-05-28 11:55:20.0  )
Trending: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన AI రోబో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఎన్నికలకు సంబంధించి తుది ఫలితాలు జూన్ 4న కౌంటింగ్‌‌తో వెలువడనున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఏపీ ఎన్నికల ఫలితాలపై దుబాయ్‌లో ప్రదర్శించిన ఓ AI రోబో చాలా యాక్టివ్‌గా రెస్పాండ్ అయింది. ఆంధ్రాకు చెందిన ఓ వ్యక్తి అక్కడ షాపింగ్ మాల్‌కు వెళ్లగా.. అక్కడ ఓ AI రోబో దర్శనమిచ్చింది. అక్కడికి వచ్చిన వారంతా ఆ రోబోకు ఏవో ప్రశ్నలు వేసి సమాధానాలు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు వ్యక్తి ‘ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు’ అని రోబోను ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా AI రోబో..‘ఆ ప్రశ్నకు నాకు సమాధానం తెలిసినా.. నేను ఆ విషయాన్ని సిక్రెట్‌గానే ఉంచేస్తా’ అని సమాధానం ఇచ్చింది. దీంతో అవాక్కైన తెలుగు యువకుడు ఇదేం రోబోరా అయ్యా.. అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

Advertisement

Next Story