Trending: ఆటోలో డీజిల్ కొట్టించేందుకు వెళ్లి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

by Shiva |   ( Updated:2024-07-28 12:18:12.0  )
Trending: ఆటోలో డీజిల్ కొట్టించేందుకు వెళ్లి చోరీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆటోలో డీజిల్ కొట్టించుకునేందుకు పెట్రోల్ బంక్‌కు వచ్చి ఓ వ్యక్తి కౌంటర్‌లో డబ్బు చోరీ చేసిన ఘటన జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట నుంచి జనగామకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద రాత్రి ఒంటి గంటకు డీజిల్ కోసం ఓ వ్యక్తి ఆటోలో వచ్చాడు. అయితే, కాసేపు బంక్‌లో ఆటు ఇటు తిరుగుతూ.. ఆటోను పక్కన పెట్టి అక్కడే ఉన్న ఆఫీస్ రూంలోకి వెళ్లాడు.

ఆ సమయంలో బంక్‌లో పనిచేసే నరేష్, నర్సింహా మంచి నిద్రలో ఉండగా ఆటోలో డీజిల్ పోయాలని వారిని నిద్రలేపాడు. వాళ్లు ఎంతకీ నిద్ర లేవదేదు. ఈ క్రమంలోనే ఆ గుర్తు తెలియని వ్యక్తికి టేబుల్ డ్రాలో డబ్బు కనిపించింది. దీంతో ఆ వ్యక్తి డబ్బు కట్టను ఒక చేత్తో పట్టుకుని జేబులో వేసుకుని అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే, ఆ తతంగం అంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్టు అయింది. దీంతో జరిగిన దొంతనంపై బంక్ యాజమాన్యం పోలీసులను ఆశ్రయించగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో కోసం పక్కనే ఉన్న లింక్ క్లిక్ చేయండి: https://x.com/ChotaNewsTelugu/status/1817526844788183525

Advertisement

Next Story

Most Viewed