- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : రైళ్లలో ప్రజలతోనే పందులు, మేకలు.. అక్కడ కామన్ అంటా!
దిశ, డైనమిక్ బ్యూరో: భారతీయ రైల్వేలో ప్రయాణికులతో కుక్కలు, పిల్లులు, పెంపుడు జంతువులను తీసుకెళ్లేందుకు షరతులతో కూడిన అనుమతి తప్పనిసరిగా ఉండాల్సిందే. కానీ ఓ రైలులో ప్రజలతో పాటు పందులు, మేకలు లాంటి జంతువులను తీసుకెళ్తున్నారు. అది కూడా ఒకటి రెండో కాదు.. మందలు మందలుగా తీసుకుపోతున్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
అయితే, చైనాలోని ఎంతో వెనుకబడిన ప్రాంతమైన డలియంగ్షాన్ ప్రాంతంలో నడిచే రైలులో ప్రజలతోపాటే కోళ్లు, మేకలు, పందులు ప్రయాణిస్తుంటాయి. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ నుంచి పంజిహువాకు రైలు వెళ్తుంది. మారుమూల పర్వత గ్రామాలను కలుపుతూ తక్కువ వేగంతో ప్రయాణించే రైలులో రైతులు వీటిని పట్టణ నగరాల్లోని మార్కెట్‌లకు తరలిస్తుంటారు. టికెట్ కూడా తక్కువ ధరలోనే ఉంటుందని స్థానిక మీడియా తెలిపింది. రైతులు తమ ఉత్పత్తులను గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ నగరాలకు రవాణా చేయడానికి ఈ రైలు అనుమతిస్తుంది. కాగా ట్రైన్‌లోనే పందులు, మేకలను కొందరు కొనుగోలు చేస్తుంటారని తెలిసింది. జంతువులను తీసుకెళ్లేందుకు అనుమతించే ఏకైక రైలు చైనాలో ఇదేనని సమాచారం.