Free Bus: వాడకం అంటే ఇదే భయ్యా.. ఉచిత పథకం పుణ్యమా అంటూ బస్సులో బ్రష్ చేస్తున్న మహిళ.. (వీడియో)

by Kavitha |   ( Updated:2024-07-29 14:00:57.0  )
Free Bus: వాడకం అంటే ఇదే భయ్యా.. ఉచిత పథకం పుణ్యమా అంటూ బస్సులో బ్రష్ చేస్తున్న మహిళ.. (వీడియో)
X

దిశ, ఫీచర్స్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అసలే అరకొరగా ఉన్న బస్సుల్లో మహిళలే అధికంగా ప్రయాణిస్తుండటంతో ఇతర ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక పండుగ వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఎట్లా టికెట్‌ లేకుండా పోవచ్చని మహిళలు.. అవసరం ఉన్నా లేకున్నా బస్సులు ఎక్కేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దానికి ఉదాహరణ గతంలో కూరగాయలు అమ్మడం, తరగడం, బీడీలు చుట్టడం వంటి చాలా వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆ కోవకు చెందిన మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఆ వీడియోలో భాగంగా.. బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్న ఓ మహిళ ఖాళీగా ఉండటం ఎందుకని అనుకున్నదో ఏమో? లేక ఊరెళ్ళే హడావిడిలో బ్రష్ చేయడం మర్చిపోయిందో ఏమో గానీ.. ఏకంగా కదులుతున్న బస్సులోనే పళ్ళు తోముకుంటూ కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఈ ఘటన ఏ డిపో పరిధిలో చోటు చేసుకుందో మాత్రం తెలియలేదు.

Advertisement

Next Story

Most Viewed