Zafrani Chai : హైద్రాబాద్లో ఆ కొత్త రకం టీ కోసం ఎగబడుతున్న జనాలు.. రేటెంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

by Prasanna |
Zafrani Chai : హైద్రాబాద్లో ఆ కొత్త రకం టీ కోసం ఎగబడుతున్న జనాలు..  రేటెంతో  తెలిస్తే షాకవ్వాల్సిందే
X

దిశ, ఫీచర్స్ : వర్షాకాలంలో సాయత్రం ఏదోకటి తినాలనిపిస్తుటుంది. కొందరు బజ్జి , సమోసా, పకోడీ లాగిస్తుంటారు మరి కొందరు వేడి వేడి ఛాయ్ తాగుతుంటారు. హైద్రబాద్లో అన్ని రకాల చాయ్‌ లు తయారు చేస్తుంటారు. యాలకుల టీ నుంచి ఇరానీ చాయ్‌ వరకూ అన్ని ఇక్కడ ఉంటాయి. చాలా మంది ఇరానీ టీ ని ఇష్టంగా తాగుతుంటారు. ఇప్పుడు దాని స్థానంలో జఫ్రానీ టీ వచ్చింది. ఈ టీ కోసం జనాలు ఎగబడుతున్నారు. ఇది మట్టి పాత్రల్లో దొరుకుతుంది. ఈ టీ ని ఒకసారి తాగితే ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

మనం తయారు చేసుకునే టీ లో డికాక్షన్‌లోనే పాలు వేసి మరిగిస్తారు. కానీ ఇక్కడ అలా కాదు మిల్క్ ను, డికాక్షన్‌ కూడా విడి విడిగా మరిగిస్తారు. ఈ టీ తాగేందుకు వచ్చిన వారికి మట్టి కప్పు లో డిక్షాక్షన్‌, పాలు కలిపి దానిలో కుంకుమ పువ్వు వేసి ఇస్తారు. దీని ధర మాములు టీ ధర కంటే రెండు రేట్లు ఎక్కువగా ఉంది అంటే రూ. 30 రూపాయలు ఉంది.

పెద్ద పెద్ద హోటళ్లలో అయితే దీని ధర వందల్లోనే ఉంటుంది. కాకపోతే దీనిలో వాడే కుంకుమ పువ్వు చాలా తేడాగా ఉంటుంది. కొన్ని రోజుల నుంచి పడుతున్న వర్షానికి నగర వాసులకు ఈ జఫ్రానీ టీ బాగా నచ్చేస్తోంది. ఓ వైపు వర్షం పడుతున్నా .. వేడి వేడిగా ఈ టీ ని తాగడానికి జనాలు ఆసక్తి చూపుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed