Viral Video:ఈ ఆటో డ్రైవర్ తెలివి చూస్తే షాక్ అవ్వడం ఖాయం.. ఎందుకంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-09-25 11:45:18.0  )
Viral Video:ఈ ఆటో డ్రైవర్ తెలివి చూస్తే షాక్ అవ్వడం ఖాయం.. ఎందుకంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:సోషల్ మీడియా(Social media) అందుబాటులోకి వచ్చాక వింతలు, విశేషాలకు కొదువే లేకుండా పోయింది. అయితే ఈ ఆధునిక యుగంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తూనే ఉన్నాం. వాస్తవానికి ప్రతి పని టెక్నాలజీ తోనే ముడిపడి ఉంది. ఇక టెక్ హబ్‌గా గుర్తింపు ఉన్న బెంగళూరు(Bengaluru)లో ఎన్నో రకాల ఆవిష్కరణలు(inventions) జరుగుతుంటాయనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా బెంగళూరులో జరిగిన ఓ ఘటన ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ఆటో డ్రైవర్ (Auto Driver) తెలివితేటలకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇంతకి ఆయన ఏం చేశాడో తెలిస్తే షాక్ అవుతారు. ఆటో డ్రైవర్(Auto Driver) తన ఆటోలో రెగ్యులర్ డ్రైవింగ్ సీటును(Regular driving seat) తొలగించి అత్యంత సౌకర్యవంతంగా ఉండే ఆఫీస్ చైర్‌ (Office Chair)ను ఫిక్స్ చేసుకున్నాడు. చక్కగా అందులో కూర్చుని హ్యాపీగా డ్రైవింగ్ చేస్తున్నాడు. ఆ ఆటో ఎక్కిన ఓ నెటిజన్ అతని ఫొటో తీసి సోషల్ మీడియాలో(Social media) పోస్ట్ చేయగా ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఎక్స్‌ట్రా కంఫర్ట్ కోసం ఓ ఆటో డ్రైవర్(Auto Driver) తన ఆటోలో ఆఫీస్ ఛైర్‌(Office Chair)ను ఫిక్స్ చేసుకున్నాడు. అందుకే నేను బెంగళూరును ఎక్కువ ప్రేమిస్తా’ అంటూ ట్విట్టర్ వేదికగా ఆమె కామెంట్ చేశారు. ఆ ఫొటో చూసిన నెటిజన్లు ఆ ఆటో డ్రైవర్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed