- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Viral News : మోసం చేసిన భార్యకు షాక్ ఇచ్చిన భర్త.. ట్విస్ట్ మామూలుగా లేదుగా..!

దిశ, వెబ్ డెస్క్ : తనని మోసం చేసిన భార్యకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు ఆమె భర్త. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్(Rajasthan) లోని కోటా(Kota)కు చెందిన మనీష్ మీనా(Manish Meena) తన భార్య స్వప్నను కష్టపడి చదివించాడు. ఆమె చదువు, ఉద్యోగం తీసుకున్న కోచింగ్ నిమిత్తం రూ.15 లక్షల లోన కూడా తీసుకున్నాడు. స్వప్న బాగా చదివి 2023లో రైల్వేలో ఉద్యోగం(Railway Job) సంపాదించింది. అయితే ఉద్యోగం సంపాదించిన తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది. ఉద్యోగం లేని పేద భర్తను చూసి అసహ్యించుకోవడం మొదలు పెట్టింది. క్రమంగా అతన్ని దూరం పెట్టి.. ఇటీవల ఇంటి నుంచి వెళ్ళిపోయింది. అయితే ఏ ఉద్యోగం చూసుకొని తనను దూరం పెట్టిందో ఆ ఉద్యోగమే ఆమెకు లేకుండా చేశాడు మనీష్. స్వప్న తనకు బదులుగా వేరొకరితో పరీక్ష రాయించి ఉద్యోగం పొందిందని అధికారుల ముందు సాక్షాధారలతో సహ నిరూపించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైల్వే బోర్డు.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతుండగా.. భలే బుద్ధి చెప్పావు గురూ అని, మైండ్ బ్లాంక్ అయ్యే షాక్ ఇచ్చావు అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.