- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viral Video : అటెండెన్స్ కావాలంటే ఆ కోరిక తీర్చాల్సిందే..! మహిళా టీచర్‌కు ఉపాధ్యాయుడి కండిషన్
దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లో డిజిటల్ అటెండెన్స్‌పై ఉపాధ్యాయులు ఇటీవల నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. అన్ని ప్రభుత్వ పాఠశాలలో టీచర్లు తమూ సూచించిన టైమ్‌కు డీజీటల్ హాజరు తప్పక వేయాల్సిందేనని యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ టీచర్లు ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఉత్తర్వులను వాయిదా వేసింది. డిజిటల్ హాజరు వ్యవస్థను నిలిపి వేసినప్పటికీ తాజాగా ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో టీచర్స్ అటెండెన్స్ కోసం తెచ్చిన డిజిటల్ హాజరు వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఓ ఉపాధ్యాయుడు తోటి ఉపాధ్యాయురాలిని ముద్దు పెట్టమని అడిగాడు. ఈ క్రమంలోనే మహిళ టీచర్ అతనికి తెలియకుండా వీడియో తీస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె డిజిటల్ హాజరును కూడా తాను చూసుకుంటానని, ఈ క్రమంలోనే తన చెంపపై వేలు పెట్టి ఇక్కడ ముద్దు పెట్టాలి అన్నట్లుగా నవ్వుతూ సైగలు చేస్తాడు.
దానికి నేను అంగీకరించను.. అంటూ మహిళా టీచర్ అతనిపై సీరియస్ అవుతుంది. దానికి సమాధానంగా ఉపాధ్యాయుడు నవ్వూ కనిపించాడు. ఈ ఘటన యూపీలోని ఉన్నావ్‌లో జరిగినట్లు తాజాగా సామాజక మాద్యామాల్లో వీడియో వైరల్‌గా మారింది. నెటిజన్లు అతనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇలాంటి కీచక టీచర్లను ఉద్యోగం నుంచి తొలగించాలని యూపీ సర్కార్‌ను నెటజన్లు డిమాండ్ చేశారు.