Viral Video: ఇంటర్నేషనల్ క్రికెట్‌ను తలపిస్తున్న గల్లీ క్రికెట్.. వీడియో వైరల్..

by Indraja |   ( Updated:2024-04-18 14:39:27.0  )
Viral Video: ఇంటర్నేషనల్ క్రికెట్‌ను తలపిస్తున్న గల్లీ క్రికెట్.. వీడియో వైరల్..
X

దిశ వెబ్ డెస్క్: అందుబాటులో లేని దాని గురించి బాధపడేకంటే మనకి ఉన్న తెలివిని ఉపయోగించుకుని దాన్ని సృష్టించుకుంటే కలిగే సంతోషాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు అనడానికి ఈ గల్లీ క్రికెట్ ఉదాహరణ. కొందరు కుర్రాళ్ళు ఆడిన గల్లీ క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్‌ను తలపిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌లోని జకోబాబాద్ జిల్లాకు చెందిన కొందరు కుర్రాళ్ళు రివ్యూ సిస్టమ్‌ను రీక్రియేట్ చేసారు.

అచ్చం అంతర్జాతీయ క్రికెట్‌లో ఎలాగైతే డీఆర్ఎస్ తీసుకున్న తరువాత రివ్యూ చెక్ చేస్తారో అలానే ఆ కుర్రాళ్ళు వాళ్ళు ఆడిన క్రికెట్‌లో రివ్యూ చెక్ చేసారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ వీడియో చూసిన నెటిజన్స్ ప్రతిభ చూపిన కుర్రాళ్లపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆ వీడియోని మీరు ఒకసారి చూసేయండి.

Advertisement

Next Story