Royal Enfield Bullet 350: బాయ్స్.. రూ. 18,700లకే రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బుల్లెట్ బండి.. త్వరపడండి..

by Sujitha Rachapalli |
Royal Enfield Bullet 350:  బాయ్స్.. రూ. 18,700లకే రాయల్ ఎన్‌‌ఫీల్డ్ బుల్లెట్ బండి.. త్వరపడండి..
X

దిశ, ఫీచర్స్ : రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 దశాబ్దాలుగా రైడర్స్ మనసు దోచుకుంటుంది. టైమ్‌లెస్ డిజైన్, ఐకానిక్ సౌండ్ కలిగిన మోటార్ సైకిల్ తరతరాలుగా అదే యూనిక్ నెస్ మెయింటైన్ చేస్తుంది. అయితే ఈ బండి ధర ప్రస్తుతం రూ. 1.46 లక్షలు ఉండగా.. చారిత్రక ధరతో పోలిస్తే భారీగా పెరిగిపోయింది. జార్ఖండ్‌లోని బొకారోలో సందీప్ ఆటో కంపెనీ జారీ చేసిన బిల్లు.. ఈ ఐకానిక్ వెహికిల్ అద్భుతమైన ధరను ప్రదర్శిస్తుంది. 1986లో బండిని కొన్న బిల్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అప్పుడు ఈ బండి ధర రూ. 18,700గా ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. అప్పటికి అదే ఎక్కువ ధర అనుకుంటా అని కామెంట్స్ చేస్తున్నారు. 'బాయ్స్ త్వరపడండి... అనుకున్నారేమో అప్పుడు' అంటూ ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక చాలా మంది ఈ వెహికల్ పై తమ జర్నీ గురించిన అనుభవాలను పంచుకున్నారు. తమ జీవితంలో ఎలా భాగం అయిందో ఎమోషనల్ స్టోరీస్ కూడా పోస్ట్ చేశారు.

Advertisement

Next Story