Modi - Trump: ‘నాటు నాటు పాట’కు ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ డాన్స్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-07 12:25:00.0  )
Modi - Trump: ‘నాటు నాటు పాట’కు ప్రధాని మోడీ, డొనాల్డ్ ట్రంప్ డాన్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నిక(US Elections)ల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. డెమోక్రటిక్‌ పార్టీ(Democratic Party) మహిళా అభ్యర్ధి కమలా హారిస్‌‌(Kamala Harris)పై ఆయన గెలుపొందారు. దీంతో 79 ఏళ్ల వయసులో ఆయన అమెరికా 47వ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఇదిలా ఉండగా.. ట్రంప్ విజయంపై సోషల్ మీడియా వేదికగా ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోస్టులు, ఫొటోలతో ట్రెండ్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలోని నాటు నాటు పాట(Naatu Naatu song)కు భారత ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi), అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ డ్యాన్స్ చేస్తున్న వీడియోలు ఎడిట్ చేసి పోస్టు చేశారు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. మరోవైపు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump)కు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. ట్రంప్‌ చరిత్రాత్మక విజయం సాధించారని ట్వీట్ చేశారు. తమ స్నేహం వల్ల భారత్‌-అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు దేశాల ప్రజల జీవితాలు మెరుగుపరుద్దమని, ప్రపంచ శాంతి, సుస్థితర, శ్రేయస్సు కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story