పిల్లికి 'డాక్టర్ ఆఫ్ లిటరేచర్' బిరుదు... దీని వెనుక ఆసక్తికరమైన విషయం ఇదే..

by Sumithra |
పిల్లికి డాక్టర్ ఆఫ్ లిటరేచర్ బిరుదు... దీని వెనుక ఆసక్తికరమైన విషయం ఇదే..
X

దిశ, ఫీచర్స్ : ప్రస్తుత ప్రపంచంలో జంతువుల ప్రాముఖ్యత నిరంతరం పెరుగుతోంది. దీనికి ఇటీవల చాలా ఉదాహరణలు మనం చూశాం. ఇది కొంతమందికి షాకింగ్‌గా అనిపించవచ్చు కానీ ఇప్పుడు ఇది పూర్తిగా సాధారణం. కొంతకాలం క్రితం మీరు ఆస్కార్ అవార్డుల వేడుకలో, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌ పై పోజులివ్వడం మీరు చేసే ఉంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక పిల్లి జనంలో చర్చలోకి వచ్చింది. వెర్మోంట్ స్టేట్ యూనివర్శిటీ కాసిల్‌టన్ క్యాంపస్ నుండి గౌరవ పట్టా పొందింది.

పిల్లికి ఇంత పెద్ద బిరుదు ఎలా ఇస్తారు అనే ప్రశ్న ఇప్పుడు మీ మదిలో మెదులుతూ ఉంటుంది. కాలేజీలో మాక్స్ డౌ వైఖరి చాలా స్నేహపూర్వకంగా ఉందని, అది వచ్చే, వెళ్లే వ్యక్తులందరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉందని ఈ కళాశాల వారు వాదించారు. ఈ విశ్వవిద్యాలయంలో అది గత కొన్ని సంవత్సరాలుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో విశ్వవిద్యాలయంలోని హాల్స్, లైబ్రరీలో తిరుగుతుందని తెలిపారు. అది ఎవరికీ హాని చేయలేదని తెలిపారు.

ఈ క్రమంలోనే విశ్వవిద్యాలయం క్యాంపస్ కమ్యూనిటీకి మాక్స్ కు "డాక్టర్ ఆఫ్ లిటరేచర్" అనే గౌరవ డిగ్రీతో సత్కరించింది. ఈ పిల్లి యజమాని షేల్ డౌ మాట్లాడుతూ 'తన పెంపుడు పిల్లికి యూనివర్సిటీ ప్రాంతం చాలా నచ్చిందని తెలిపారు. విద్యార్థులను ఎప్పుడు ఎక్కడ కలవాలో దానికి తెలుసని తెలిపారు. క్యాంపస్‌లో అందరికీ మాక్స్ తెలుసు. ప్రజలు భయం లేకుండా దాంతో ఆడుకున్నారు. అది ఎవరికీ హాని చేయలేదన్నారు.

మాక్స్ గురించి సమాచారం ఇస్తూ కళాశాల తన హ్యాండిల్‌లో వెర్మోంట్ స్టేట్ యూనివర్శిటీ ట్రస్ట్ బోర్డ్ మాక్స్ డౌను ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ లిటరేచర్‌తో సత్కరించిందని రాసింది. ఈ బిరుదు ఇస్తూ దానికి అభినందనలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ బిరుదుతో దాన్ని డా. మాక్స్ డౌగా పిలవొచ్చని తెలిపారు. అంతే కాదు 'ఈసారి మాక్స్ కాన్వొకేషన్ సమయంలో వేదికపైకి నడవలేడు, కానీ త్వరలో రెండవ వేడుకలో దాని గౌరవ డిగ్రీ ఇస్తాం' అని విశ్వవిద్యాలయ అధికారులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed