డేంజరేస్ డ్రైవింగ్‌తో స్కూటీపై రొమాన్స్‌తో రెచ్చిపోయిన ప్రేమ జంట(వీడియో)

by Anjali |   ( Updated:2024-01-17 07:34:44.0  )
డేంజరేస్ డ్రైవింగ్‌తో స్కూటీపై రొమాన్స్‌తో రెచ్చిపోయిన ప్రేమ జంట(వీడియో)
X

దిశ, సినిమా: ప్రస్తుత రోజుల్లో యువత ఏ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తోంది. మెట్రో రైళ్లలో, రోడ్లపై కదులుతున్న వాహనాల్లో ప్రేమ జంటలు హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. రీసెంట్‌గా బైక్‌పై, ముద్దులతో రెచ్చిపోతూ.. తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించిన ఘటన చూసే ఉంటారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ ప్రేమ జంట అత్యంత ప్రమాదకరంగా డ్రైవింగ్ చేస్తూ.. స్కూటీపై రొమాన్స్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో డ్రైవింగ్ చేస్తోన్న యువకుడి ఒడిలో యువతి కూర్చుని అతడ్ని హగ్ చేసుకుని ముద్దులు పెడుతుంది. స్కూటీ నడుపున్న వ్యక్తి కనీసం రోడ్డుపై దృష్టి పెట్టకపోవడమే కాకుండా హెల్మెట్ కూడా ధరించలేదు. ఈ ఘటన ముంబయిలోని బాంద్రాలో చోటు చేసుకుంది.

ఇలాంటి ఆకతాయిలకు పోలీసులు ఎప్పటికప్పుడు కౌన్సిలింగ్ ఇచ్చిన, భారీ జరిమానా విధించిన కొందరిలో మార్పు రావడం లేదు. రోడ్లపై ఇలాంటి విన్యాసాలు చేయడం అప్పటివరకు సంతోషాన్నిస్తాయి. కానీ ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాల మీదకు తెచ్చుకున్నవారవుతారు అంటూ ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story