Hyderabad:నడి రోడ్డు పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వీడియో వైరల్!

by Jakkula Mamatha |
Hyderabad:నడి రోడ్డు పై రెచ్చిపోయిన ప్రేమ జంట.. వీడియో వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: ప్రజెంట్ జనరేషన్‌లో కొంత మంది యువత సోషల్ మీడియాలో ఫేమస్ (famous) అవ్వాలని ఎంత దిగజారిపోతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వయసుతో సంబంధం లేకుండా ప్రేమలో పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. స్కూల్ వయసు నుంచే ప్రేమయాణం సాగిస్తున్నారు. పేరెంట్స్‌కి తెలియకుండా ఇష్టమొచ్చినట్లు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో యువతీ, యువకులు రోడ్డుపైన రొమాన్స్ చేసకుంటున్న వీడియోలు తరచు వార్తలలో చూస్తునే ఉన్నాం. రన్నింగ్ బైక్‌లు, కార్‌లలో రొమాన్స్ చేసుకుంటూ నెట్టింట హల్‌చల్ చేస్తున్నారు. బస్టాండ్ (Bus stand), రైల్వే స్టేషన్ (Railway station), మెట్రో(Metro)లలో రెచ్చిపోతున్నారు. చుట్టు ఎవరున్న తమకేం అన్నవిధంగా ప్రవిర్తిస్తున్నారు. ప్రజెంట్ ఇలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతోంది.

అసలు విషయంలోకి వెళితే.. నిన్నమొన్నటి వరకు ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో కనిపించిన బైక్‌ రొమాన్స్‌ ఇప్పుడు హైదరాబాద్‌‌లో వెలుగు చూసింది. శ్రీశైలం రహదారిపై ప్రేమ జంటలు (love couple) చెలరేగిపోతున్నాయి. నిన్న(బుధవారం) ఓ ప్రేమజంట (love couple) పట్టపగలు బైక్‌పై రొమాన్స్ (Romance on a bike) చేస్తూ చెలరేగిపోయింది. పెట్రోల్ ట్యాంకుపై ప్రియుడికి ఎదురుగా కూర్చున్న యువతి అతడికి ముద్దులు పెడుతూ రొమాన్స్ చేసింది. అది బహిరంగ ప్రదేశమని, తమ చుట్టూ జనం ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా పోయింది. పహాడీషరీఫ్ వద్ద జరిగిన ఈ ఘటనను మరో జంట వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed