'నా యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైమ్ మీతో మాట్లాడాలనిపించింది'.. బుల్లితెర నటి ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)

by Kavitha |   ( Updated:2024-10-25 15:11:11.0  )
నా యాక్సిడెంట్ తర్వాత ఫస్ట్ టైమ్ మీతో మాట్లాడాలనిపించింది.. బుల్లితెర నటి ఎమోషనల్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: బుల్లితెరపై పాపులారిటీ సంపాదించుకున్న నటీమణుల్లో శ్రీవాణి ఒకరు. ‘చంద్రముఖి’ సీరియల్ ద్వారా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న ఈమె విక్రమాదిత్య అనే వ్యక్తిని లవ్ మ్యారేజ్ చేసుకున్నది. తన భర్త ఈవెంట్ ఆర్గనైజన్ అండ్ మానేజర్‌‌గా పని చేస్తున్నాడు. ఈ అమ్మడు ప్రస్తుతం పలు సీరియల్స్‌తో పాటు ‘మేడమ్ అంతే’ అనే యూట్యూబ్ చానల్‌ను కూడా రన్ చేస్తోంది. కాగా వీరికి నందిని అనే పాప కూడా ఉంది. ఇదిలా ఉంటే, రీసెంట్‌గా శ్రీవాణికి యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని తన భర్త తెలియజేస్తూ శ్రీవాణి యూట్యూబ్ చానల్‌లో ఓ లాంగ్ వీడియో కూడా పెట్టాడు. అప్పుడే ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే కోలుకుని శ్రీవాణి తన ఇంటికి వచ్చింది. దీంతో ఆమె తన కోసం ప్రార్థించిన వారందరితో మాట్లాడాలి అనుకుని ఒక వీడియోను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఆమె మాట్లాడుతూ.. “నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వాళ్ళు ట్రీట్‌మెంట్ చేయకుండా మరీ నీచంగా చూశారు. ఇది యాక్సిండెంట్ కేసు కావడంతో ఒక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒక కానిస్టేబుల్ చెప్పిన సమాధానం మాకు కోపం తెప్పించింది. కనీసం ఆ హాస్పిటల్‌లో ఫస్ట్ ఎయిడ్ కూడా చేయకుండా అలానే చూస్తూ ఉన్నారు. అయితే ఫైనల్‌గా వేరే హాస్పిటల్‌కి వెళ్లడం.. అక్కడ ఫేస్ మీద కట్ అయిన పార్ట్‌కి 20 స్టిచెస్ వేసి నన్ను బాగా చూసుకున్నారు. ఇక నా రెండు వేళ్ళు ఫ్రాక్చర్ అయ్యాయి.

అయితే ఇలాంటి టైంలో ఎంతోమంది నాకు ఫోన్ చేసి నా క్షేమ సమాచారాలు అడిగారు. వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అయితే అలా రక్తపు మడుగులో ఉన్న నన్ను చూసి నా భర్త విక్రమాదిత్య పిచ్చోడయిపోయాడు అంటూ శ్రీవాణి చెప్పుకొచ్చింది. ఇక విక్రమ్ మాట్లాడుతూ.. అసలు శ్రీవాణి లేకపోతే ఎలా బతకాలో తెలీదు. నందినిని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. ఎందుకంటే శ్రీవాణి నన్ను ఒక కొడుకులా చూసుకుంటుంది అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

(video link credits to madam anthey youtube channel)

Advertisement

Next Story