Uttar Pradesh : కస్తూర్భాగాంధీ బాలికలపై వార్డెన్ కిరాతకం! వీడియో వైరల్

by Ramesh N |   ( Updated:2024-08-05 09:18:06.0  )
Uttar Pradesh : కస్తూర్భాగాంధీ బాలికలపై వార్డెన్ కిరాతకం! వీడియో వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో మెనూ ప్రకారం ఆహారం, పండ్లు, పాలు తదితరాలను వార్డెన్ అందించడం లేదని విద్యార్థులు ఆరోపించారు. దీనిపై నిరసన తెలపడంతో వార్డెన్ వారిని దారుణంగా కొట్టారు. దీంతో బాలికల చేతులు, వీపు, ఛాతీ తదితర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

వివరాల ప్రకారం.. గోరఖ్‌పూర్‌లోని ఖజ్నీ పట్టణంలోని ఉసావన్ బాబు గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వార్డెన్ అర్చన పాండే విద్యార్థినులను కర్రతో కొట్టే దృశ్యాలు వీడియోలో కన్పిస్తున్నాయి. దీంతో వారు ఏడుస్తున్నారు. చాలా మంది విద్యార్థినులను వార్డెన్ కొట్టడం వల్ల వారి శరీరాలపై అయిన గాయాలను చూపుతున్నారు. వీడియో వైరల్ కావడంతో బీఎస్ఏ రామేంద్ర కుమార్ సింగ్ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీంతో విషయం నిజమేనని తేలింది. నివేదిక అందిన తర్వాత వార్డెన్‌పై చర్యలు తీసుకుంటామని బీఎస్ఏ వెల్లడించింది. ఈ ఘటనపై బాలికల తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed